calender_icon.png 3 April, 2025 | 5:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బహుజన రాజ్యాధికార పోరాటయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్

02-04-2025 06:25:19 PM

జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే..

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): బహుజన రాజ్యాధికార పోరాటయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. బుధవారం కలెక్టరేట్ లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలకు జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డేవిడ్, అధికారులు, గౌడ సంఘం నాయకులు, వెనుకబడిన తరగతుల కులాల సంఘాల నాయకులతో హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి పాపాన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... బహుజనుల కొరకు రాజ్యాధికార పోరాటాలు చేసిన యోధుడు, మొగలాయిల దౌర్జన్యాలకు, జమీందారులకు వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడని అన్నారు.

బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవ ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని, ఇలాంటి మహనీయుల చరిత్రను భావితరాలకు అందించేందుకు అందరం సమిష్టిగా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి సజీవన్, జిల్లా పంచాయతీ అధికారి బిక్షపతి గౌడ్, గౌడ సంఘం నాయకులు బాలేష్ గౌడ్, సుదర్శన్ గౌడ్, మహిళ సంఘ అధ్యక్షురాలు అన్నపూర్ణ, వెనుకబడిన తరగతుల కులాల ప్రతినిధులు, గౌడ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.