02-04-2025 07:04:51 PM
కాటారం (విజయక్రాంతి): బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడ గ్రామంలో గౌడ సంఘం అధ్యక్షుడు చీటూరి రాజలింగు గౌడ్ అధ్వర్యంలో వర్ధంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా సర్దార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బహుజన రాజ్యాన్ని స్థాపించిన తొలి పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని అన్నారు, పాపన్న గౌడ్ ఆశయాలను గౌడ కులస్తులు కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చిటూరి రాజలింగు గౌడ్, మార్క రవీందర్ గౌడ్, చిటూరి మల్లయ్య గౌడ్, చీకట్ల స్వామి గౌడ్, మారగోని తిరుపతి గౌడ్, బొడిగే రాజీర్ గౌడ్ , మారగోని రాజబాపు గౌడ్, గణపతి గౌడ్, పడాల శంకర్ గౌడ్ , కరెంగల వెంకన్న గౌడ్, మారగోని నాగయ్య, మహేష్ గౌడ్, కిరణ్ గౌడ్, శ్రవణ్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, శివ గౌడ్, రవికుమారి గౌడ్, తదితరులు పాల్గొన్నారు.