calender_icon.png 3 April, 2025 | 5:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న 315వ వర్ధంతి వేడుకలు

02-04-2025 06:17:18 PM

మందమర్రి (విజయక్రాంతి): సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 315 వ వర్ధంతి వేడుకలు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని పాత బస్టాండ్ రైల్వే గేట్ ప్రాంతంలో ఉన్న రేణుక ఎల్లమ్మ దేవాలయంలో సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి వేడుకలు గౌడ సంఘం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్బంగా పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు ఆర్పించారు. అనంతరం గౌడ సంఘం నాయకులు మాట్లాడారు. 17వ శతాబ్దంలోనే దక్కన్ గడ్డపై మొదటిసారిగా బహుజన రాజ్యాన్ని స్థాపించిన తొలి బహుజన పోరాట యోధులు సర్దార్ సర్వాయి పాపన్న ఒక సాధారణ గౌడ కులంలో జన్మించి ఆనాటి సామాజిక వ్యవస్థలో ఉన్న ఆధిపత్య కులాల అధికారాన్ని బానిసత్వాన్ని ధిక్కరించి దళిత బహుజనులను రాజ్యాధికారం వైపు నడిపిన తొలి బహుజన రాజు సర్దార్ సర్వాయి పాపన్న అని అన్నారు.

సర్దార్ సర్వాయి పాపన్న గోల్కొండ కోటపై మొట్టమొదటిసారి జెండా ఎగరవేసిన నాయకుడు అని ఆయన సేవలను గుర్తు చేసుకునారు. ప్రతి ఒక్కరు ఆయన  ఆశయాలను కొనసాగించాలని కోరారు.  ఈ కార్యక్రమంలో జిల్లా గౌడ సంఘం నాయకులు నోముల ఉపేందర్ గౌడ్, మడిపల్లి వెంకటేశ్వర గౌడ్, వడ్లకొండ కనుకయ్య గౌడ్, సౌల్ల వెంకా గౌడ్, నోముల శ్రీనివాస్ గౌడ్, సట్ల సంతోష్ గౌడ్, రంగు రవీందర్ గౌడ్, బండి శంకర్ గౌడ్, బుర్ర ఆంజనేయులు గౌడ్, పోతునూరి ప్రభాకర్ గౌడ్, కత్తి నర్సాగౌడ్, దూలం రవీందర్ గౌడ్, బండారి శ్రీనివాస్ గౌడ్, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, కొయ్యడ కుమార్ గౌడ్, రంజిత్ గౌడ్, శంకర్ గౌడ్, పంజాల రాజయ్య గౌడ్ లు పాల్గొన్నారు.