calender_icon.png 24 October, 2024 | 8:54 AM

ఎమ్మెల్సీగా గెలిపిస్తే.. ఒక్క రూపాయికే హెల్త్, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ

14-09-2024 03:44:46 PM

కరీంనగర్, (విజయక్రాంతి): కరీంనగర్ నగరంలో పలు ప్రయివేట్ విద్య సంస్థలలో పనిచేసే ఉపాధ్యాయులను కలిసి మద్దతు కోరడం జరిగింది. ఈ సందర్భంగా సర్దార్ రవీందర్ సింగ్ మాట్లాడుతూ.. ఇప్పుడు జరగబోయే కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ నియోజకవర్గాల స్థానం నుండి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయడం కోసం మీ ముందుకు వస్తున్నాను. అనేక సంవత్సరాల నుండి పట్టభద్రులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గ్రహించి వారి గొంతుకగా పటాపత్రుల సమస్యల పరిష్కారం కోసం పట్టాభద్రులకు ఒక ప్రతినిధిగా  శాసనమండలిలో పట్టభద్రుల పక్షాన ప్రశ్నించే ఒక గొంతుగా ఈ ఎన్నికలలో పోటీ చేయడం కోసం మీ ముందుకు వస్తున్నాను.

అదేవిధంగా నాకు అవకాశం వచ్చిన కరీంనగర్ నగరానికి కరీంనగర్ మేయర్ గా ఒక రూపాయికే నల్లపథకాన్ని తీసుకొచ్చిన, తరువాత అదే ఆ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా తీసుకువెళ్లారు, అదేవిధంగా నేను స్వయంగా రూపకల్పన చేసి రూపాయికే అంతక్రియలు పథకాన్ని తీసుకురావడం జరిగింది. అది భారతదేశంలోనే ఒక గొప్ప పథకంగా అప్పటి ఉప రాష్టపతి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మరియు వారి మంత్రివర్గం కూడ అభినందనలు తెలిపిన విషయం మనందరికీ తెలిసిందే. రూపాయికే నల్ల, రూపాయికి అంతక్రియలు, రూపాయికే సానిటరీ నాప్కిన్స్, ఈ విధంగా రూపాయి పథకాలను తీసుకొచ్చి విజయవంతంగా అమలుపరిచిన సందర్భం మనం కరీంనగర్ నగర్ ప్రజల అనుభవంలో ఉంది. ఇప్పుడు ఎమ్మెల్సీగా నాకు అవకాశం కల్పించి నన్ను దీవించి నాకు ఓట్లేసి గెలిపించి శాసనమండలికి పంపిస్తే నేను స్వతహాగా నిజామాబాద్, అదిలాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాల పరిధిలో ఉన్న అర్హులైన పట్టాభద్దులందరికీ ఒక రూపాయికే  హెల్త్, ఆక్సిడెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ చేయించి ఇస్తానని హామీ ఇస్తున్నాను.

నేను శాసనమండలిలో అడుగుపెడితే తప్పకుండా ఈ నాలుగు జిల్లాలో ఉన్న పట్టభద్రులందరికీ కేవలం ఒక్క రూపాయికే  హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ చేయించి మీ కుటుంబాలకు భరోసా కల్పించి, మీకు ఒక సహాయకుడిగా మీకు సంతోషం వచ్చిన, దుఃఖం వచ్చిన, ఒక శాసనమండలి సభ్యుడుగా కాకుండా మీలో ఒకడిగా మీ కుటుంబ భారాన్ని మోసే బాధ్యతను నేను తీసుకుంటాను. అదేవిధంగా ప్రభుత్వం నుండి రావలసిన మన హక్కుల కోసం శాసనమండలిలో ప్రశ్నించే గొంతుగా ప్రజా సమస్యలను నిత్యం ప్రశ్నిస్తూనే ఉంటా, నిరుద్యోగుల ఉద్యోగ అవకాశాల విషయంలో కానీ, ఉద్యోగులకు సంబంధించిన అనేక సమస్యల మీద కానీ, మహిళలకు ఉన్న సమస్యల మీద కానీ, ప్రైవేటు ఉద్యోగస్తులకు ఉన్నటువంటి సమస్యల మీద ఒక అవగాహన ఉన్న వ్యక్తిగా, టీచర్ మా కుటుంబంలోనే మా ఇంటి బాధ్యతను మోస్తుంది కనుక బాధ్యతలు అ బరువులు నాకు తెలుసు గనుక నేను తప్పకుండా మీకోసం పనిచేస్తానని హామీ ఇస్తున్నాను.

ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా అర్హులైనటువంటి పట్టాభద్రులు అంటే ప్రైవేట్ ఉపాధ్యాయులు, న్యాయవాదులు,  మహిళలు, యువకులు,  ప్రైవేట్ రంగాల్లో పనిచేసే ఉద్యోగస్తులు ఇలా అర్హులైన ప్రతి పట్టాభద్రుడికి ఇందులో చేర్చే విధంగా నేను ప్రయత్నం చేస్తాను కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఈ నాలుగు జిల్లాలలో ఉన్న ప్రతి పట్టభద్రుడినికి  ఆక్సిడెంటల్ మరియు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ వర్తించే విధంగా పథకాన్ని తీసుకువస్తానాని,  అర్హులైన పట్టాభద్రుడు ఒక రూపాయి కట్టితే చాలు వారికి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ చేయించి ఆపత్రాన్ని వారి ఇంటికి పంపించే బాధ్యతను నేను తీసుకుంటానాని సర్దార్ రవీందర్ సింగ్ అన్నారు. కావున కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాలో ఉన్న పట్టభద్రులు ఈనెల 30 తారీకు నుండి ఓటరుగా నమోదు చేసుకోవాలని, పోయినసారి ఎన్నికల్లో ఓటు వేసిన ఓటర్లు కూడ మళ్లీ  ఇప్పుడు ఓటరు నమోదు చేసుకోవాలని కోరుతున్నాను.