మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి
మహేశ్వరం, ఆగస్టు 25: తెలంగాణ ప్రజల రక్షణ కోసం ఆంగ్లేయులతో పోరాడిని వీరుడు సర్దార్ పాపన్నగౌడ్ అని మహే శ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. మహేశ్వరం మండల పరిధిలోని గట్టుపల్లిలో ఆదివారం దివంగత సర్దార్ పాపన్నగౌడ్ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాలకులు ప్రజల కోసం ఆలోచన చేయనప్పుడు సామాన్య జనం నుంచి తిరుగు బాటు పుడుతుందన్నారు. సర్దార్ పాపన్న జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు.