calender_icon.png 25 October, 2024 | 11:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాథనాధుడిగా శరత్‌కుమార్

15-07-2024 02:06:56 AM

మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘కన్నప్ప’ చిత్ర ప్రచార కార్య క్రమాలు టీజర్‌తో మొదలైన సంగతి తెలిసిందే. మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ బాబు, బ్రహ్మానందం, ప్రీతి ముకుందన్, కాజల్ అగర్వాల్ వంటి భారీ తారగణంతో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్‌లో  ప్రేక్షకుల ముందుకు రానుం ది. కాగా ఆదివారం శరత్ కుమార్ పుట్టిన రోజు సందర్భంగా ‘కన్నప్ప’ చిత్రం నుంచి ఆయన పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. సినిమాలో నాథనాధుడి పాత్ర పోషించిన శరత్ కుమా ర్.. ఈ పోస్టర్‌లో ఉగ్రరూపంతో ఓ యోధుడిలా కనిపిస్తున్నారు.

సిద్ధార్థ్  సినిమాలోనూ..

మరోవైపు ‘భారతీయుడు 2’ చిత్రంతో ఇటీవల తెరమీదికొచ్చిన సిద్ధార్థ్ తన నలభైవ సినిమాకి సిద్ధమవుతున్నారు. శ్రీ గణేష్ దర్శకత్వంలో తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమాలో శరత్ కుమార్ కీలక పాత్రలో కనపడనున్నట్టు చిత్ర వర్గాలు తెలిపాయి. దేవయాని మరో ముఖ్య పోషించ నున్నారు. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పనులు పూర్తి కావచ్చాయి. ఇతర నటీనటులు, సాంకేతిక వర్గ వివరాలు త్వరలో తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు.