calender_icon.png 1 January, 2025 | 10:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సరస్వతి శిశు మందిరాలు చదువుల నిలయాలు

29-12-2024 11:18:59 PM

నిజామాబాద్ (విజయక్రాంతి): సాక్షాత్తు సరస్వతి నిలయాలు సరస్వతీ శిశు మందిరాలని సరస్వతీ శిశు మందిరం అంటే సాక్షాత్తు సరస్వతి అమ్మవారు కొలువై ఉన్న ప్రదేశం అని విద్యతో పాటు సద్బుద్ధులు ధర్మ సంరక్షణ శిక్షణకై పెట్టిన పేరని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. సరస్వతీ శిశు మందిర్ 43వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన శిశు మందిరం పూర్వ విద్యార్థుల మహా సమ్మేళన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భావి భారత పౌరులకు చదువులమ్మ తల్లి ఒడిలో విద్యతో పాటు దేశ సంస్కృతి సాంప్రదాయాలను బోధించే ఏకైక పాఠశాలలు సరస్వతీ శిశు మందిరాలు అన్నారు.

విద్యార్థులను కేవలం చదువులకు మాత్రమే పరిమితం చేయకుండా సమాజంలో మనుగడ సాధించేందుకు దేశ భక్తిని పెంపొందించడంతో పాటు అవసరమైన జ్ఞానాన్ని విజ్ఞానాన్ని బోధిస్తూ విలువలతో కూడిన విద్యను అందిస్తూ జాతి వికాసంలో జాతీయ పునర్ నిర్మాణం వైపు విద్యార్థులను తీర్చిదిద్దుతున్న విద్యాసంస్థలు సరస్వతి శిశు మందిరాలని ఆయన ప్రశంసించారు. సరస్వతి శిశు మందిరాలు ఏర్పడి అర్థ శతాబ్దం 50 ఏళ్లు అవుతున్న ప్పటికీని విద్యలో విద్యాబోధన తీరులో ఏ మాత్రం మార్పు లేదని చిన్న మొక్కగా ప్రారంభమైన సరస్వతి శిశు మందిరాలు మహావృక్షంలో ఎదిగి ఎంతో మంది విద్యార్థులను జాతీయ ఉన్నారు.

నిర్మాణంలో చేస్తోందని ఇది గర్వించదగ్గ విషయమని ఆయన విద్యాసంస్థలను కొనియాడారు. విద్యార్థి దశ నుండి విద్యార్థులకు విద్యతో పాటు శారీరక మానసిక ఉల్లాసం ఆటలు వ్యాయామం యోగా సంగీతం కళాత్మకంగా నైతిక ఆధ్యాత్మిక సంస్కృతిని అందించడం జాతికి గర్వకారణం అన్నారు. క్రమశిక్షణకు మారుపేరుగా శిశు మందిరాలు సమాజంలో ఉన్నత స్థానాలలో ఐఏఎస్ ఐపీఎస్ లుగా వ్యాపారవేత్తలుగా ఎందరినో ఉన్నత స్థానాల్లో నిలబెట్టిందన్నారు. శిశు మందిరాలలో విద్యను అభ్యసించడం అదృష్టంగా భావించి విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా ఉన్నత లక్ష్యం సాధించే దిశగా అడుగులు వేయాలని తమ లక్ష్యాన్ని చేరుకునే వరకు సాధన చేస్తూనే ఉండాలని, దేశ పునర్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.