16-04-2025 02:09:15 AM
హైదరాబాద్, ఏప్రిల్ 15(విజయక్రాంతి): గతంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే సరస్వతి పుష్కరాలు నిర్వహించామని, ఇప్పుడు కూడా ఆ అవ కాశం తమకే లభించిందని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అభిప్రా యపడ్డారు. సరస్వతీ పుష్కరాల పండగకు స్నానఘాట్ల విస్తరణతో సహా వివిధ అభివృద్ధి పనులను విస్తృతంగా చేపట్టినట్టు పేర్కొన్నారు.
2025, మే 15 నుంచి 26 వరకు తెలంగాణలోని భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరగనున్న సరస్వతీ పుష్కరాలకు చేసిన ఏర్పాట్ల వివరాలు భక్తులకు తెలిపేందుకు వెబ్ పోర్టల్, మొ బైల్ యాప్‌ను మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్‌బాబు మంగళవారం సచివాలయంలో ప్రారంభించారు. కార్యక్ర మం లో దేవాదాయ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ శ్రీధర్, ధార్మిక పరిషత్ అడ్వుజర్ గోవిందహరి, భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ, ఆలయ ఈవో మహేశ్ తదితరులు పాల్గొన్నారు.