రేపు పాకాల యశోదారెడ్డి వర్ధంతి :
ఆమె మాండలికానికి పెట్టింది పేరు. మాండలికానికి మెరుగులు దిద్దిన సాహితీవేత్త. ‘సూటి తప్ప పక్క పోటెరుగదు నా మాట’ అని పొల్లు పోని వ్యక్తిత్వంతో తెలుగు మాండలిక పదసంపదకు, పరిరక్షణకు ఎనలేని సేవలందించిన గొప్ప రచయిత్రి పాకా ల యశోదారెడ్డి. రాష్ట్ర అధికార భాషా సం ఘం అధ్యక్షురాలిగా పని చేసిన ఏకైక మహి ళ.
మహబూబ్‌నగర్ జిల్లా బిజినేపల్లిలో సరస్వతమ్మ కాశిరెడ్డి దంపతులకు 1929 ఆగ స్టు 8న యశోదారెడ్డి జన్మించారు. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన ఆమెను రుక్కునమ్మ చేరదీసి పెంచారు. చదువే ప్రాణంగా పెరిగిన ఆమె ఉన్నత విద్యను అభ్యసించారు.
1955లో హైదరాబాద్ ఉమె న్స్ కాలేజీలో తెలుగు ఉపన్యాసకురాలిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. సంస్కృ తం, జర్మన్ భాషలను అధ్యయనం చేశారు. యశోదారెడ్డి తెలుగులో ‘హరివంశములు’ అంశంపై పరిశోధన చేసి 1969లో డాక్టరేట్ పట్టా పొందారు. 12వ ఏట నుంచి రచనలు మొదలుపెట్టి సుమారు 30 గ్రంథాలను ప్రచురించారు.
నవల, కథ, కవిత, వ్యాసం తదితర ప్రక్రియల్లో సాగిన పాకాల వారి రచనా వ్యాసం గం తెలుగు సాహిత్యలోకంలో ఆమెకు ప్రత్యే క స్థానాన్ని సంపాదించి పెట్టాయి. ‘మూసీ’, ‘పరిశోధన’, ‘ఆంధ్రప్రదేశ్’, ‘జాగృతి’, ‘ప్రజాతంత్ర’, ‘భారతి’, ‘నా తెలంగాణ’ పత్రికల్లో ఆమె రాసిన వందలాది పరిశోధనాత్మక వ్యాసాలు ప్రచురితమయ్యాయి.
తెలంగాణ మాండలికంలో రాసిన కథలు, హాస్య రచన లు, పండగలు ఎచ్చమ్మ ముచ్చ ట్లు, మహాలక్ష్మి ముచ్చట్లు, జెర ఇనుకోవే తల్లీ అనే శీర్షికలతో రెండు వందలాదిగా ప్రసంగాలు ‘ఆకాశవాణి’లో ప్రసారమయ్యా యి. 1949 ప్రాంతంలో దక్కన్ రేడియోలో మాండలిక భాషలో మొట్టమొదటి కథలు, సంభాషణలు, పిల్లల నాటికలు ప్రారంభించిన ఘనత ఆమెకే దక్కింది.
తెలంగాణ నుడికారంతో కథలు రాయమని తొలుత ఆమెను బెజవాడ గోపాలరెడ్డి, తిరుమల రామచంద్ర ప్రోత్సహించినట్లు తెలుస్తు న్నది. అలా మాండలికంలో విలువైన సాహిత్యాన్ని సృష్టించిన ఆద్యురాలుగా తెలంగాణ చరిత్రలో సుస్థిరంగా ఆమె పేరు నిలిచిపోయింది. ఆమె ఉపన్యాసాలు విని ప్రఖ్యాత చిత్రకారుడు పి.టి.రెడ్డి ఆమెను ఇష్టపడి పెళ్ళి చేసుకున్నారు. ఉద్యోగ, సాహిత్య జీవితానికి ఆయన అందించిన తోడ్పాటుతో ఆమె ఎన్నో రచనలు చేశారు.
మారుతున్న భాషా ప్రవాహంలో ప్రాచీ న రూపాలు కొట్టుకుపోకుండా కాపాడటం భాషావేత్తల బాధ్యతగా భావించిన యశోదారెడ్డి మాండలిక పదాలను, జాతీయాలను, పదబంధాలను, పరిణామ క్రమంలో మాం డలిక పదాలు పలకడంలో వస్తున్న మార్పులను గ్రంథస్థం చేశారు.
అనేక భాషా సాహి త్య సంఘాలకు విశిష్ట సభ్యురాలిగానూ ఉండి, సేవలందించిన ఆమె 1990 నుంచి 1993 వరకు ‘రాష్ట్ర అధికార భాషా సంఘం’ అధ్యక్షురాలిగా పనిచేశారు. రాష్ట్ర సాహిత్య అకాడమీ నుంచి ‘ఉత్తమ రచయిత్రి’ పురస్కా రం అందుకున్నారు. ఆగ్రా విశ్వవిద్యాలయం నుంచి డి.లిట్ గౌరవ పట్టాను పొందారు. తెలుగుభాషను, తెలంగాణ మాండలికాన్ని సజీవంగా నిలబెట్టడంతో కృషి చేసిన ఆమె, 2007 అక్టోబర్ 7న తనువు చాలించారు.
కామిడి సతీష్‌రెడ్డి