calender_icon.png 20 March, 2025 | 6:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కడుపుబ్బా నవ్వించే సారంగపాణి

19-03-2025 12:00:00 AM

శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటిల కాంబోలో వచ్చిన ‘జెంటిల్‌మన్’, ‘సమ్మోహనం’ విజయాన్నందుకున్నాయి. వాళ్లి ద్దరి కలయికలో మూడో చిత్రంగా ‘సారంగపాణి జాతకం’. వస్తోంది. ఇందులో ప్రియదర్శి హీరోగా నటించగా, తెలుగమ్మాయి రూప కొడువాయూర్ కథానా యికగా నటించింది.

వీకే నరేశ్, తనికెళ్ల భరణి, శ్రీనివాస్ అవసరాల, వెన్నెల కిశోర్, వైవా హర్ష, శివన్నారాయణ, అశోక్‌కుమార్, రాజా చెంబోలు, వడ్లమాని శ్రీనివాస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా వేసవిలో థియేటర్లలో వినోదం పంచేందుకు సిద్ధమైంది.

ఈ సినిమా విడుదల తేదీని నిర్మాత కృష్ణప్రసాద్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ఏప్రిల్ 18న మా ‘సారంగపాణి జాతకం’ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ఫస్ట్ కాపీతో సహా సినిమా రెడీ అయ్యింది. త్వరలో సెన్సార్ పూర్తి చేస్తాం. వేసవిలో హాయిగా ఎంజాయ్ చేసే చిత్రమిది. ఇంటిల్లిపాదినీ కడుపుబ్బా నవ్వించే సినిమా” అని పేర్కొన్నారు.