calender_icon.png 27 February, 2025 | 5:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నవ్వించేందుకు ప్రిపేర్ అవుతున్న పెళ్లి కాని ప్రసాద్

25-02-2025 12:00:00 AM

సప్తగిరి హీరోగా అభిలాష్ రెడ్డి గోపిడి దర్శకత్వం లో ఒక అవుట్-అండ్-అవుట్ ఎంటర్‌టైనర్ రూపొందుతోంది. ఈ చిత్రాన్ని భాను ప్రకాశ్‌గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్‌రెడ్డి ము త్యాల కలిసి నిర్మిస్తున్నారు. టైటిల్, ఫస్ట్ లుక్ సహా ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన అప్‌డేట్‌లను మేకర్స్ రివీల్ చేశారు. ఈ సినిమాకు ‘పెళ్లి కాని ప్రసాద్’ అనే టైటిల్ పెట్టారు. ఇది ఐకానిక్ బ్లాక్‌బస్టర్ మల్లీశ్వరిలో వెంకటేశ్ క్యారెక్టర్‌ని గుర్తు చేస్తోంది. ఫస్ట్‌లుక్ పోస్టర్ సప్తగిరి పాత్ర హ్యుమర్ నేచర్‌ని హైలైట్ చేస్తోంది. ఈ సినిమాలో ప్రియాంక శర్మ కథానాయికగా నటిస్తోంది. మురళీధర్ గౌడ్, లక్ష్మణ్ , అన్నపూర్ణమ్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మార్చి 21న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.