26-04-2025 05:49:41 PM
సిద్దిపేట (విజయక్రాంతి): తెలుగులో ఉన్న సాహిత్య ప్రక్రియల ద్వారా వివిధ మార్గాలై సమాజంలో మార్పు తీసుకురావచ్చని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ జల్లిపల్లి బ్రహ్మం అన్నారు. శనివారం సిద్దిపేట ప్రెస్ క్లబ్ కవి వంగరి వెంకటేశం రచించిన సప్తశతి మణిపూసలు పుస్తకావిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ జల్లిపల్లి బ్రహ్మం మాట్లాడుతూ... ప్రకృతిలోని ప్రతి అంశంపై రచనలు చేయవచ్చన్నారు. దేశభక్తి, దైవభక్తి గల్గిన సప్తశతి రచనలు మానవ జీవితం ప్రభోదించబడిందన్నారు. రసపిపాస కలిగిన హృదయాలు ఉండాలన్నారు. మాత్రా చందస్సు కలిగిన రచనలు ఎల్లకాలం నిలుస్తాయన్నారు. మణిపూసలు సృష్టికర్త వడిచర్ల సత్యం మాట్లాడుతూ.. మణిపూసలు ప్రారంభించి నేడు ఏడవ వార్షికోత్సవం జరుగుతున్న సందర్భంగా మణిపూసలు ప్రక్రియలో ఇది 123వ పుస్తకమన్నారు. సిద్దిపేటలో 33 మంది రచయితలు మణిపూసలు రచనలు చేస్తున్నారన్నారు.
విశేషమైనసాహిత్య సంపద కలిగిన సిద్దిపేటలో సమాజంలోని అంశాలన్ని సృజిస్తూ వంగరి వెంకటేశం రచించిన ఏడు వందల మణిపూసలుతో సప్తశతి పుస్తకావిష్కరణ జరగడం సంతోషమన్నారు. రాబోయే రోజులలో సిద్దిపేట రచయితల కలం నుండి మరిన్ని రచనలు జాలువారాలన్నారు. భూంపల్లికి చెందిన స్నేహమండలి ఆధ్వర్యంలో సప్తశతి పుస్తక రచయిత వంగరి వెంకటేశంకు ఘనంగా సత్కారం చేశారు. కార్యక్రమంలో బాలసాహితీవేత్త ఉండ్రాళ్ళ రాజేశం, ఉమాదేవి, అనురాధ, సత్య, ఆశీర్వాదం, దోమకొండ అంజయ్య, నూనే రాజయ్య, చంద్రయ్య, పట్నం భూపాల్, సింగీతం నరసింహరావు, కుందారం యాదగిరి, సి. హేచ్ రాజు, సిద్దిరాంరెడ్డి, వరుకోలు లక్ష్మయ్య, పప్పుల రాజిరెడ్డి, శ్రీచరణ్ సాయిదాస్, బస్వ రాజ్ కుమార్, నల్ల అశోక్, శాడ వీరారెడ్డి, వెంకటేశ్వర్లు, ఫణింద్ర, ఎడ్ల లక్ష్మి, అనిశెట్టి సతీష్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.