calender_icon.png 3 March, 2025 | 2:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంతోష్ ముదిరాజ్‌కు డాక్టరేట్

03-03-2025 12:11:42 AM

జనగామ, మార్చి 2 (విజయక్రాంతి) : జనగామ జిల్లా వెంకిర్యాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు సంతోష్ ముదిరాజ్ కు ఓయూ వర్సిటీ డాక్టర్ వైట్ ప్రధానం చేసింది. భారతదేశంలో ప్రభుత్వాలు విద్యపై చేసే వ్యయం, ఆర్థికాభివృద్ధి మధ్య గల సంబంధం అనే అంశంపై ప్రొఫెసర్ జాడి నరసింహ రావు పర్యవేక్షణలో ఆయన పరిశోధన చేశారు.  ఉస్మానియా విశ్వవిద్యాలయ అర్ధ శాస్త్ర విభాగం మద్దెల సంతోష్ ముదిరాజ్ కు డాక్టరేట్ ప్రదానం చేసింది. ఈయన  తెలంగాణ ఉద్యమ సమయంలో ఓయూ జేఏసీ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో రాష్ర్ట కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం కాంగ్రెస్ నేతగా, ముదిరాజ్ మహాసభ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి గా కొనసాగుతున్నారు.