calender_icon.png 3 March, 2025 | 2:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ ‘జాక్‌రెడ్డి’కి కుల పట్టింపెక్కువే!

02-03-2025 12:41:24 AM

విక్రాంత్, చాందినీచౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘సంతాన ప్రా ప్తిరస్తు’. ప్రస్తుత సమాజంలో యువ జంట లు ఎదుర్కొంటున్న ఓ ప్రధాన సమస్యను కథలో చూపిస్తూ వినోదాత్మకంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు సంజీ వ్‌రెడ్డి. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో డైరెక్టర్, యాక్టర్ తరుణ్‌భాస్కర్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. జాక్‌రెడ్డి అనే ఆ క్యారెక్టర్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ శనివారం విడుదల చేశా రు. జాక్‌రెడ్డి ఫ్యునెరల్ సర్వీసెస్ అందించే జాక్‌రెడ్డికి కుల పట్టింపు కాస్త ఎక్కువే.

శతకకర్త వేమన (వేమారెడ్డి) కూడా తమ కులం వాడేనని గర్వంగా చెప్పుకుంటాడట ఈ జాక్‌రెడ్డి. శవాలతోపాటు సమస్యల్నీ పూడ్చిపెట్టే జాక్‌రెడ్డి బాడీ లాంగ్వేజ్ సీరియస్‌గా కనిపిస్తున్నా ప్రేక్షకులకు హిలేరియస్‌గానే ఉండ నుందని చిత్రబృందం చెబుతోంది. వెన్నెల కిషోర్, అభినవ్ గోమఠం, మురళీధర్‌గౌడ్, శ్రీలక్ష్మి, హర్షవర్ధన్, బిందు చంద్రమౌళి, జీవన్‌కుమార్, సత్యకృష్ణ, తాగుబోతు రమేశ్, అభయ్ బేతిగంటి, కిరీటి, అనీల్ గీల, సద్దాం వంటి తారాగణం ఇందులో భాగస్వామ్యమైంది. త్వరలోనే థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: -మహిరెడ్డి పండుగుల; సంగీతం: సునీల్ కశ్యప్; మాటలు: కల్యాణ్ రాఘవ్; నిర్మాతలు: మధుర శ్రీధర్‌రెడ్డి, నిర్వి హరిప్రసాద్‌రెడ్డి; స్టోరీ, స్క్రీన్ ప్లే: సంజీవ్‌రెడ్డి, షేక్ దావూద్ జీ.