calender_icon.png 22 October, 2024 | 10:01 AM

సంతాన ప్రాప్తిరస్తు స్పెషల్ పోస్టర్

31-07-2024 12:05:00 AM

విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘సంతాన ప్రాప్తిరస్తు’. మధుర ఎంటర్‌టైన్‌మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్‌పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అల్లు శిరీష్ హీరోగా “ఏబీసీడీ” సినిమా, రాజ్‌తరుణ్‌తో “అహ నా పెళ్లంట” అనే వెబ్ సిరీస్ రూపొందించిన సంజీవ్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. మంగళవారం హీరో విక్రాంత్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు బర్త్ డే విషెస్ తెలియజేస్తూ “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా టీమ్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు.

సినిమా కథని తెలిపేలా డైట్, మెడిసిన్స్, వ్యాయామం, యోగా, స్ట్రెస్ తగ్గించుకోవడం ద్వారా స్పెర్మ్ కౌంట్ పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న హీరో స్టిల్‌తో రూపొందించిన ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. చిత్ర దర్శకుడు సంజీవ్ రెడ్డి ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన తెలంగాణ ప్రభుత్వ యాంటీ డ్రగ్ యాడ్‌ను రూపొందించిన సంగతి తెలిసిందే. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’, ‘ఏక్ మినీ కథ’ చిత్రాలకు స్క్రీన్ ప్లే అందించిన షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే రాస్తున్నారు. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, అభినవ్ గోమఠం, మురళీధర్ గౌడ్, జీవన్ కుమార్, తాగుబోతు రమేశ్, రచ్చ రవి తదితరులు ఇతర తారాగణం.