calender_icon.png 20 February, 2025 | 1:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

19న సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు

17-02-2025 07:57:20 PM

కొత్తగూడెం (విజయక్రాంతి): బంజారా కుటుంబాల ఆరాధ్యులు సంత్ సేవాలాల్ జయంతి వేడుకలను ఈ నెల 19న ఘనంగా నిర్వహించాలని గిరిజన సంఘాల ఐక్య వేదిక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం కొత్తగూడెం క్లబ్బులో జరిగిన ఐక్య వేదిక సమావేశం అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా మాట్లాడుతూ.. నియోజకవర్గ స్థాయి వేడుకలను 19న లక్ష్మీదేవిపల్లి మండల పరిధిలోని ఇల్లందు క్రాస్ రోడ్డు హరిత హొటల్లో నిర్వహించేందుకు నిర్ణయం జరిగిందని తెలిపారు.

వేడుకల నిర్వహణకు ప్రభుత్వం తమ సహకారం అందించనుంది. నియోజకవర్గ పరిధిలోని బంజారా కుటుంబాలు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తో పాటు జిల్లా ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని సాబీర్ పాషా తెలిపారు.