calender_icon.png 23 February, 2025 | 12:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా సంత్ సేవాలాల్ జయంతి

18-02-2025 12:00:00 AM

ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

కూసుమంచి , ఫిబ్రవరి 17 : బంజా రాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ జ యంతి ఉత్సవంను కూసుమంచి మండల కేంద్రంలో లంబాడీలు ఘనంగా నిర్వహిం చారు. ఈ వేడుకలకు మంత్రి తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.. గిరిజనుల తో కలిసి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు.

అనంతరం లంబాడి ప్రజలను , సంత్ సేవాలాల్ ను ఉద్దేశించి మాట్లాడారు. లంబాడీ అంటేనే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటేనే లంబాడీ ,లంబాడీలు తనకు ఓట్లు వేయడంతో గత ఎన్నికల్లో నాకు భారీ మెజారిటీ రావడంలో కీలక పాత్ర పోషిం చారు. లంబాడీలను ఎస్టీలో చేర్చిన ఘనత కాంగ్రెస్‌దే అన్నారు.. సేవాలాల్ ను బంజారాల ఆరాధ్య దైవంగా పిలుస్తారు.

అతన్ని హిందూధర్మం గొప్పతనం బంజా రాలకు తెలియజేయడానికి జన్మించిన మహానుభావునిగా భావిస్తారు అని అన్నా రు. సేవాలాల్ మహరాజ్ జయంతి పురస్క రించుకుని ఫిబ్రవరి 15న సెలవు దినంగా తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 2024లో ప్రకటించిందినీ గుర్తు చేశారు.

సంత్ సేవాలాల్ మహరాజ్ హింస పాపమని, మత్తు, ధూమ పానం శాపం అని హితవు పలికి బంజారా జాతికే కాదు యావత్తు ఇతర కులాలకు ఆదర్శపురుషుడయ్యారు. సేవాలాల్ మహరాజ్ ఆనాడు బంజారా జాతి పరువు ప్రతిష్టల గురించి ముందు గానే ఊహించి అహింస సిద్ధాంతానికి పునాది వేసి ఆచరించి చూపారు.

బ్రిటిష్ పాలకుల మత ప్రచారం ద్వారా బంజారా సమాజం అనేక ఇబ్బందులకు గురి అ య్యింది. ఈ పరిస్థితులలో బంజారా జాతి ని సన్మార్గంలో నడిపించేంందుకు సేవా లాల్ మహారాజ్ అవతరించారు. సేవాలాల్ మహారాజ్ ఆదివాసీ హక్కుల పరిరక్షణ, సమాజ మార్గదర్శకత్వంలో కీలక పాత్ర పోషించారు.

ఆయన చూపిన మార్గం ఆది వాసీ ఉద్యమాలకు, సామాజిక సమానత్వ పోరాటాలకు ప్రేరణగా నిలుస్తోంది. గోండు తెగకు చెందిన మహానుభావుడిగా, సమాజ సేవకుడిగా, ఆదివాసీ హక్కుల పరిరక్షకుడిగా గుర్తింపు పొందారు.  గోం డు తెగ ప్రజలను ఆర్థికంగా, సాంస్కృతి కంగా, రాజకీయంగా అభివృద్ధి చేసేందు కు ఉద్యమించారు.

అప్పటి ఆధిపత్య వ్యవస్థలపై పోరాడి, ఆదివాసీలను వారి హక్కుల గురించి చైతన్యం కలిగించారు. ఆయన ఆదివాసీ తెగల సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ... నూతన మార్గదర్శనం ఇచ్చారు. మహారాజ్‌ను  ఆధ్యాత్మిక గురువుగా, ధర్మ పరిరక్షకుడిగా భావిస్తారు.

తెలంగాణ ప్రభుత్వం  సేవాలా ల్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తూ... ఆదివాసీ ప్రజలకు గౌరవం ఇస్తోంది. ఆదివాసీ గౌరవాన్ని పెంచేలా రాష్ర్ట ప్రభు త్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతుంది  తెలిపారు.