02-04-2025 12:00:00 AM
జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన కొత్త పథకం
భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ 1 (విజయక్రాంతి) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాల్లో సన్న బియ్యం పంపిణి పథకం కీలకంగా మారనుందని, పేద కుటుంబాల ఆకలితీర్చే ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అన్నారు. మంగళవారం జిల్లా వ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం జోరుగా సాగింది.
కొత్తగూడెం నియోజకవర్గంలో ఎమ్మెల్యే సాంబశివరావు కొత్తగూడెం పట్టణంలోని 28వ వార్డు రామాటాకీస్ ఏరియా, చుంచుపల్లి మండలంలోని రాంనగర్, సుజాతనగర్లో రేషన్ షాపుల్లో సన్నబియ్యం పథకాన్ని శ్రీకారం చుట్టారు.భద్రాచలం నియోజకవర్గం లో ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు భద్రాచలం పట్టణంలో గిరిజన సహకార సంస్థ రేషన్ షాపులో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇల్లందు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య మున్సిపాలిటీ పరిధిలోని రెండవ వార్డ్ షాపు నెంబర్ 45లో పథకాన్ని ప్రారంభించారు. పినపాక నియోజకవర్గం మణుగూరులో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పాలకుల సన్న బియ్యం పథకం అమలు ప్రకటనకు పరిమితమైందన్న విషయాన్ని గుర్తు చేశారు.
ఇతర రాష్ట్రాలకు ఈ పథకం ఆదర్శమన్నారు. ప్రజల ఆరోగ్యానికి, పోషకాహార భద్రతకు ఈ పథకం దోహదపడుతుందని, ఈ పంపిణీ కార్యక్రమాన్ని పేదవర్గాల సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. పథకం అమలులో ఎలాంటి అవినీతి, అక్రమాలకూ తావులేకుండా పకడ్బందీగా కొనసాగించాలని, సంబంధిత అధికారులు నిత్యం పర్యవేక్షించాలని ఆదేశించారు.
పేదల బియ్యం పక్కదారి పడితే ఉపేక్షించేది లేదని కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు. సన్న బియ్యం పంపిణీతో నిరుపేద లకు కొంత ఆర్థిక భారం తగ్గినట్లు అవుతుంది