సన్నాల సాగుకు ప్రోత్సాహం
క్వింటాలుకు రూ.500 బోనస్
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నల్లగొండ, అక్టోబర్ 9 (విజయక్రాంతి): వచ్చే జనవరి నుంచి రేషన్ దుకాణాల ద్వారా పేదలకు సన్నబియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కార్యచరణ సిద్ధం చేసిందని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. నల్లగొండ పట్టణ పరిధిలోని ఆర్జాలబావిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన ప్రారం భించారు.
అనంతరం అక్కడే ఏర్పా టు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రం లో 53 శాతం సన్నధాన్యం పండుతున్నదని, పేదలు సైతం సన్నబియ్యం తినాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు. సన్నాల సాగును ప్రోత్సహించేందుకు సర్కారు క్విం టాకు రూ.500 బోనస్ ఇవ్వనుందని తెలిపారు.
ఏ గ్రేడ్ ధాన్యం క్వింటాకు రూ. 2,320, సాధారణ రకానికి క్వింటాకు రూ. 2,220 మద్దతు ధర ప్రకటించినట్లు గుర్తు చేశారు. సన్నాలకు బోనస్ చెల్లిస్తున్నందున పక్క రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారుల ను ఆదేశించారు. కాంగ్రెస్ ది కర్షక ప్రభుత్వమని, రాష్ట్రంలో ఒకేసారి 22 లక్షల మందికి రూ.18 వేల కోట్ల రైతు రుణాలు మాఫీ చేసిన ఘటన తమ ప్రభుత్వానిదేనన్నారు.
11న ఇంటిగ్రేటెడ్ హాస్టళ్లకు శంకుస్థాపన
రూ.200 కోట్లతో ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ హాస్టల్‌ను నిర్మి స్తామని, తొలి విడతలో ఈ నెల 11న 20 నియోజకవర్గాల్లో పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి కోమటి రెడ్డి వెల్లడించారు. నల్లగొండ జిల్లాలోని చెరువులను కృష్ణా నీటితో నిం పేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
రెండేళ్లలో ఎస్సెల్బీ సీ సొరంగాన్ని పూర్తి చేసి జిల్లా ప్రజలకు సాగు, తాగునీటిని అందిస్తామ న్నారు. అనంతరం నల్లగొండ ఎన్జీ కళాశాల మైదానంలో రాష్ట్రస్థాయి మహిళ ల ఖోఖో ఎంపిక పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మ న్ శ్రీనివాస్‌రెడ్డి, వైస్ చైర్మన్ రమేష్‌గౌడ్, డీఎస్‌ఓ వెంకటేశ్వర్లు, డీఎస్‌ఎం హరీష్, డీఏఓ శ్రవణ్, మార్కెటింగ్ ఏడీ ఛాయాదేవి పాల్గొన్నారు.