calender_icon.png 6 April, 2025 | 6:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి పేదోడు సన్నబియ్యంతో కడుపు నిండా తినాలనేదే ప్రభుత్వ లక్ష్యం

05-04-2025 04:12:49 PM

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్

చేగుంట,(విజయక్రాంతి): ప్రతి పేద వాళ్ళ సైతం పెద్దల మాదిరిగానే సన్న బియ్యంతో అన్నం తినాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిదని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, తీసుకువచ్చిందని అన్నారు. మండల పరిధిలో చిన్న శివనూర్ గ్రామంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఆహార భద్రత పథకం(Food Security Scheme)లో భాగంగా రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజా పంపిణీ వ్యవస్థలో సన్న బియ్యం పంపిణీ పథకం చారిత్రాత్మక నిర్ణయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అర్హులైన లబ్ధిదారులను గుర్తించి రేషన్ కార్డులను అందజేస్తామన్నారు. ఆహార భద్రత కార్డులోని ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకి ఆరు కిలోల చొప్పున, అంత్యోదయ కార్డు ఒక్కంటికి 35 కిలోలు చొప్పున, అన్నపూర్ణ కార్డు ఒక్కంటికి 10 కిలోల చొప్పున ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.