calender_icon.png 4 February, 2025 | 2:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.303 కోట్ల వసూళ్లతో ‘సంక్రాంతికి వస్తున్నాం’ రికార్డు

03-02-2025 11:42:35 PM

విక్టరీ వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం అపూర్వమైన విజయంతో తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక గొప్ప రికార్డ్ సాధించింది. ఈ చిత్రం రీజనల్ సినిమా సరిహద్దులను చెరిపివేసింది. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్ల వసూళ్లను దాటిన మొదటి తెలుగు ప్రాంతీయ చిత్రంగా చరిత్రలో తన పేరును లిఖించుకుంది. ఇప్పటివరకు రూ.303 కోట్ల వసూళ్ల సాధించిందీ సినిమా.

వెంకటేశ్ తన జనరేషన్‌లో రూ.300 కోట్ల వసూళ్లను సాధించిన ఫస్ట్ యాక్టర్‌గా నిలిచారు. ఈ చిత్రం నాలుగో వారంలోకి అడుగుపెట్టినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద అద్భుతంగా రాణిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా.. నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్లకు గొప్ప రాబడిని తెచ్చిపెడుతోంది. ఈ చిత్రం అనేక ప్రాంతాల్లో పాన్- ఇండియా సినిమాల కలెక్షన్లను కూడా అధిగమించింది. దిల్ రాజు సమర్పణలో శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ నిర్మించిన ఈ సినిమా.. ప్రస్తుత సవాలుతో కూడిన పరిస్థితుల్లో ప్రాంతీయ చిత్రంగా రూ.300 కోట్ల మైలురాయిని చేరుకోవడం అసాధారణ విజయంగా పేర్కొంటున్నాయి సినీవర్గాలు.