calender_icon.png 12 January, 2025 | 4:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిర్వహణ ఖర్చులకే సంక్రాంతి ప్రత్యేక చార్జీలు: సజ్జనార్

12-01-2025 01:24:13 AM

హైదరాబాద్, జనవరి 11 (విజయక్రాంతి): ప్రధాన పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో నడిపే స్పెషల్ బస్సులకు అయ్యే కనీస డీజిల్ ఖర్చులు, నిర్వహణ మేరకే టికెట్ ధరలను సవరించినట్టు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు.

తిరుగు ప్రయాణంలో ప్రత్యేక బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య చాలా తక్కువగా ఉన్నా రద్దీ రూట్లలో ప్రయాణికులకు అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు ఖాళీ బస్సులను త్వరతగతిన సంస్థ వెనక్కి తెప్పిస్తుందని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రద్దీకి అనుగుణంగా వాటిని ఆయా రూట్లలో నడిపిస్తున్నట్టు వెల్లడించారు.

ఈ నేపథ్యంలోనే  స్పెషల్ బస్సులకు అయ్యే కనీస డీజిల్ ఖర్చులు, నిర్వహణ మేరకు టికెట్ ధరలను పెంచుకోవచ్చని 2003లో జీవో నంబర్ 16ను రాష్ర్ట ప్రభుత్వం జారీ చేసిందని, ఆ ప్రకారం ఈ సంక్రాంతికి కేవలం 5 రోజులపాటు టికెట్ ధరలను ఆర్టీసీ పెంచిందని స్పష్టంచేశారు.

ప్రైవేట్ వాహనాల్లో ప్రమాదకర ప్రయాణం చేయొద్దని ప్రజలకు విజ్ఞప్తిచేశారు. ఆర్టీసీ సిబ్బంది ఎంతో అనుభవజ్ఞులని, ఆర్టీసీ బస్సుల్లో సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరారు.