పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్
హైదరాబాద్, జనవరి 12 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రజలకు పీసీసీ అధ్యక్షు డు మహేశ్‌కుమార్‌గౌడ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగి మంటలు అందరి జీవితాల్లో అశాంతిని తొలగించి భోగభాగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు పే ర్కొన్నారు. ఈ సంక్రాంతి ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, సంస్కృతీ సంప్రదాయాలు పరమిళించే అతిపెద్ద పండుగ సంక్రాంతిఅని అన్నారు. ప్రతీఒక్కరు ఆనందోత్సవాలతో జరుపుకోవాలని పీసీసీ చీఫ్ ఆ కాంక్షించారు. ఈ సంక్రాంతితో రైతు లు కుటుంబాల్లో సుఖ సంతోషాలు వెల్లివిరియాలన్నారు.