calender_icon.png 10 January, 2025 | 7:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నరసింహారెడ్డి కళాశాలలో ఘనంగా సంక్రాంతి సంబరాలు

09-01-2025 10:47:17 PM

మేడ్చల్ (విజయక్రాంతి): గుండ్ల పోచంపల్లి మున్సిపల్ పరిధిలోని నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రాంగణమంతా ముగ్గులు, భోగి మంటలు, పతంగులతో కోలాహలంగా మారింది. డూడూ బసవన్నల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలుగు పండుగల సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించాలని ఉద్దేశంతో సంక్రాంతి సంబరాలు జరుపుతున్నామని కళాశాల కార్యదర్శి త్రిశూల్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ జే నరసింహారెడ్డి, కార్యదర్శి త్రిశూల్ రెడ్డి, కోశాధికారి త్రిలోక్ రెడ్డి, డైరెక్టర్ ఏ మోహన్, ప్రిన్సిపల్ ఆర్ లోకనాథం, ఎస్ ఎసి కన్వీనర్ కే.పురుషోత్తం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.