calender_icon.png 16 January, 2025 | 3:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా సంక్రాంతి సంబురాలు

16-01-2025 01:01:12 AM

  1. ధనుర్మాస ఉత్సవాలు
  2. మకర జ్యోతి వేడుకలు

జగిత్యాల, జనవరి 15 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి పర్వ దినాన్ని పురస్కరించుకొని సంబరాలు వైభ వంగా జరిగాయి. జిల్లా కేంద్రంతో పాటూ ధర్మపురి, కోరుట్ల నియోజకవర్గ కేంద్రంల్లో, మెట్పల్లి పట్టణంలో సంబరాలు అంబరా న్నంటాయి జిల్లా వ్యాప్తంగా ఉన్న వైష్ణవాల యాల్లో వైఖానసులు శాస్త్రోక్తంగా ధనుర్మా స ఉత్సవాలను నిర్వహించారు.

గోదాదేవి పాశురాలు పఠిస్తూ, శ్రీవారికి,  దేవేరికి ప్రత్యే క పూజలు జరిపారు. ఇళ్ల ముందు ముగ్గుల తో అలంకరించి, గొబ్బెమ్మలు పెట్టి సంక్రాం తి లక్ష్మికి ప్రత్యేక పూజలు చేశారు. దక్షిణాయ ణం ముగిసి, ఉత్తరాయణ కాలం ప్రారంభా నికి సూచికగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే శుభ ఘడియలను భోగి మంటల తో, సంక్రాంతి, కనుమ వేడుకలతో ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. 

మకర జ్యోతి వేడుకలు

అయ్యప్ప స్వామి దేవాలయాల్లో మకర జ్యోతి వేడుకలు ఘనంగా జరిగాయి. కేరళ లోని సుప్రసిద్ధ శబరిమల అయ్యప్ప స్వామి క్షేత్రంలో జరిగే ‘మకర విళక్కు’ వేడుకలను జిల్లా వ్యాప్తంగా అయ్యప్ప దేవాలయాల్లో వేడుకగా జరిపారు. ఈ మేరకు జగిత్యాల, కోరుట్ల, మెట్టుపల్లి, ధర్మపురి, రాయికల్ అయ్యప్ప ఆలయాల్లో స్వాములు జ్యోతి దర్శన వేడుకలు జరుపుకున్నారు.

కోరుట్ల లోని జ్ఞాన సరస్వతి శనీశ్వర సహిత అయ్య ప్ప స్వామి దేవాలయంలో ఉదయం స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై పంచామతాభిషేకాలు, పుష్పార్చనలు, 18 మెట్లపూజ భక్తీశ్రద్ధలతో నిర్వహించారు. ఆల య ప్రధానార్చకులు పాలెపు రామకష్ణశర్మ, గౌరవాధ్యక్షులు చిదురాల నారాయణ గురు స్వామి, అధ్యక్షులు అంబటి శ్రీనివాస్, సం క్రాంతి ఉత్సవ దాత రాచమడుగు శ్రీనివాస రావు నేతత్వంలో ఉత్సవాలు నిర్వహిం చారు.

కాగా పలు దేవాలయాల్లో భక్తులకు అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేశారు. సాయం త్రం ‘జ్యోతి దర్శన’ సందర్భంగా టీవీలో శబరిమల ప్రత్యక్ష ప్రసార వేడుకలు ఏర్పా టుచేసి, స్వామి వారికి డోలోత్సవం నిర్వ హించారు. ఈ వేడుకల్లో భక్తులు, గురుస్వా ములు, దీక్షా స్వాములు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.