calender_icon.png 14 January, 2025 | 1:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీలోని కిషన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి వేడుకలు

13-01-2025 07:29:37 PM

ఢిల్లీ: సంక్రాంతి పర్వదినం(Sankranthi Festival) పురస్కరించుకొని సోమవారం సాయంత్రం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddyఢిల్లీలోని నివాసంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సంక్రాంతి వేడుకలకు ముఖ్యఅతిథిగా హజరైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi)తో పాటు స్పీకర్ ఓం బిర్లా(Speaker Om Birla), కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసరాజు, ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవీ, ఏఐజీ ఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, బాడ్మింటన్ క్రీడాకారిణీ పీవీ సింధు, ఎంపీలు, వివిధ రంగాల ప్రముఖులు విచ్చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెంకటేశ్వర స్వామి ప్రతిమను మోదీకి అందజేశారు. ఈ వేడుకల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు అట్టహసంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో గాయని సునీత పాటలతో అలరించారు.