- న్యూఢిల్లీలో జరిగిన వేడుకకు హాజరైన ప్రధాని మోదీ
- స్వాగతం పలికిన కిషన్‌రెడ్డి, చిరంజీవి, పెమ్మసాని
- భారీగా తరలివచ్చిన తెలుగు ప్రముఖులు
హైదరాబాద్, జనవరి 13 (విజయక్రాం తి): దేశ రాజధాని ఢిల్లీలోనూ సంక్రాంతి సంబురాలు వైభవంగా సాగుతున్నాయి. సోమవారం కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి నివాసంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఢిల్లీలోని ఆయన నివాసంలో సంక్రాంతి వేడుకలకు ప్రధాని మోదీతోపాటు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, జ్యోతిరాదిత్య సింధియా, మనోహర్ లాల్ కట్టర్, పెమ్మసాని చంద్రశేఖర్, బండి సంజ య్, సతీశ్‌చంద్ర దూబే, శ్రీనివాస్ వర్మ, సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి, ఎంపీలు లక్ష్మణ్, ఈటల రాజేందర్, డీకే అరుణ, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, గోడెం నగేశ్, బాలశౌ రి, అనురాగ్ ఠాకూర్, సహా పలువురు తెలంగాణ, ఏపీ, జాతీయ బీజేపీ నేతలు భారీగా వేడుకలకు హాజరయ్యారు.
కేంద్ర మంత్రి నివా సానికి చేరుకున్న ప్రధాని మోదీకి కిషన్‌రెడ్డి, చిరంజీవి, పెమ్మసాని చంద్రశేఖర్ సాదర స్వాగతం పలికారు. సంక్రాంతి వేడుకల సందర్భంగా తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా కిషన్‌రెడ్డి ఇంటిని ముస్తాబు చేశారు. అతిథులకు నోరూరించే తెలంగాణ వంటకాలను రుచి చూపించారు.
అత్భుతమైన సాంస్కృతిక ఉత్సవాన్ని చూసి ఆనందించా..
“నా మిత్రుడు, మంత్రివర్గ సహచరుడు కిషన్‌రెడ్డి ఇంటిలో ఏర్పాటు చేసిన సంక్రాంతి ఉత్సవాలను వెళ్లాను. అత్భుతమైన సాంస్కృతిక ఉత్సవాన్ని చూసి ఎంతో ఆనందించాను. దేశమంతటా ప్రజలు సంక్రాంతి, పొంగల్‌ను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఇది మన సంస్కృతిలోనూ వ్యవసాయ సంప్రదాయాల్లోనూ అంతర్భాగమైన కృతజ్ఞత, సమృద్ధి, పునరుద్ధరణల వేడుక. అందరికీ సంక్రాంతి, పొంగల్ శుభాకాంక్షలు. ఆనందం, మంచి ఆరోగ్యంతో పాటు రాబోయే కాలంలో మరిం త సుసంపన్నమైన పంట చేతికి అందాలని కోరుకుంటున్నాను..” అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.