మేడ్చల్ (విజయక్రాంతి): మేడ్చల్ పట్టణంలోని బచ్పన్ స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. స్కూల్ ఆవరణలో తమ పిల్లలతో కలిసి తల్లులు ముగ్గులు వేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ సుధీర్ కుమార్ మాట్లాడుతూ.. పిల్లలకు పండుగ సంస్కృతి సంప్రదాయాలను తెలియజేయడానికి సంబరాలు నిర్వహిస్తున్నామన్నారు. తల్లులు కూడా ఉత్సాహంగా పాల్గొని ముగ్గులు వేయడం అభినందనీయమన్నారు. తల్లులు వేసిన ముగ్గులను పరిశీలించి ఉత్తమ ముగ్గులు వేసిన ఐదుగురిని ఎంపిక చేసి బహుమతులు అందజేశారు.