రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి...
కామారెడ్డి (విజయక్రాంతి): సంక్రాంతి ముగ్గులు మన సంస్కృతిని తెలియజేస్తాయని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి(MLA Pocharam Srinivas Reddy) అన్నారు. సోమవారం రాత్రి కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం రైతునగర్ గ్రామంలో జన్మభూమి చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి సంక్రాంతి సంబురాలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సంక్రాంతి పండుగ మూడు రోజుల పండుగని అన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలను పిండి వంటల రూపంలో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలకు బహుమతులు ప్రధానం చేశారు. నియోజకవర్గ ప్రజలకు ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రో కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు, బీర్కుర్ మండల ప్రజాప్రతినిధులు, శ్రీనివాసరావు నాయకులు, రైతునగర్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.