calender_icon.png 14 January, 2025 | 5:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

3 రోజుల్లో రూ.6 కోట్లు

14-01-2025 01:51:40 AM

ఆర్టీసీకి కలిసొచ్చిన సంక్రాంతి 

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 13 (విజయక్రాంతి): సంక్రాంతికి నగర వాసులు సొంతూళ్లకు తరలడంతో ఆర్టీసీకి 3 రోజుల్లో రూ.6కోట్ల ఆదాయం వచ్చింది. సంక్రాంతికి విద్యాసంస్థలకు వారం రోజులు సెలవు రావడంతో అనేక మంది సొంతూళ్లకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో టీజీఆర్టీసీ రాష్ట్రవ్యాప్తంగా 6,432 బస్సులను ప్రత్యేకంగా అందుబాటులో ఉంచింది.

వీటిలో ఒక్క హైదరాబాద్ సిటీ జోన్ నుంచే ఇతర ప్రాంతాలకు 3వేలకు పైగా బస్సులు కేటాయించారు. శుక్ర, శని, ఆదివారాల్లో అత్యధిక ప్రయాణికులు తమ సొంతూళ్లకు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో శుక్ర వారం 406 బస్సులు, శనివారం 1,400 బస్సులు, ఆదివారం 470 బస్సుల ను హైదరాబాద్ సిటీ జోన్ నుంచి బయలుదేరాయి. అంతే కాకుండా, సికిం ద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి, చర్లపల్లి రైల్వే స్టేషన్లు మూడ్రోజుల పాటు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి.