పాల్వంచ,(విజయక్రాంతి): కేఎల్ఆర్ విద్యాసంస్థలలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. సంక్రాంతి సంబరాల్లో భాగంగా కాలేజ్ ఆవరణలో శనివారం సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించుకున్నారు. పండుగ ప్రాముఖ్యతను విద్యార్థులు అద్దం పట్టేలా వేషధారణతో వివరించారు. భోగి మంటలు వేసుకుని సాంస్కృతిక నృత్య కార్యక్రమాలు ప్రదర్శించారు. కార్యక్రమంలో కె.ఎల్.ఆర్ చైర్ పర్సన్ నాగమణి, డైరెక్టర్ సిద్ధార్థ రెడ్డి, సింధూ రెడ్డి, కాశి విశ్వనాథం, మురళి, ప్రసాద్ కేఎల్ఆర్ విద్యాసంస్థల ప్రిన్సిపల్, స్టాఫ్ ,విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.