calender_icon.png 15 November, 2024 | 6:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిన్నారులకు అండగా ‘సంజీవని’

15-11-2024 01:23:56 AM

సమావేశంలో మాట్లాడుతున్నసునీల్ గవాస్కర్

మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్

కొండపాక, నవంబర్14: వయస్సుతో నిమ్మిత్ంత లేకుండా చిన్నారులకు హృదయ సంబంధిత శస్త్ర చికిత్సలు ఉచితంగా అందించటమే సత్యసాయి సంజీవని హస్పిటల్ ముఖ్య ఉద్దేశమని మాజీ ఇండియన్ క్రికెటర్, సత్యసాయి సంజీవని ట్రస్టు సభ్యుడు సునీల్ గవాస్కర్ అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా కొండపాకలోని సత్యాసాయి సంజీవని కార్డియాలజి, రీసర్చ్ ఇనిస్ట్యూట్‌ను సందర్శించిన డా.శ్రీనివాస్, వివేక్‌గౌర్‌తో కలసి సునీల్ గవాస్కర్ పరిశీలించారు.

ట్రస్టు ఆధ్వర్యంలో ఇప్పటివరకు 33,200 ఉచిత గుండె ఆపరేషన్లను విజయవంతంగా జరిపించినట్లు ఆయన తెలిపారు. అలాగే ట్రస్టు ఆధ్వర్యంలో స్కూళ్లు, గ్రామాల్లో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నవంబర్ 18 నుంచి కొండపాకలోని సంజీవని ఆసుపత్రి ద్వారా చిన్నారులకు ఉచిత వైద్య సేవలు అందించనున్నట్లు ట్రస్టు సభ్యులు తెలిపారు.