నిజామాబాద్, డిసెంబర్ 11 (విజయక్రాంతి): తెలం గాణ ఒలింపిక్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నిజామాబాద్ జిల్లాకు చెందిన ఈగా సంజీవ్‌రెడ్డి ఎన్నికయ్యారు. కార్యవర్గసభ్యుడిగా అద్యాల లింగన్న ఎన్నికయ్యారు. గతంలో ఎన్నికల ప్రక్రియ పూర్తయినప్పటికీ న్యాయపరమైన అడ్డంకులు ఉండటంతో ఫలితాలను నిలిపివేశా రు. బుధవారం కోర్టు ఉత్తర్వుల మేర కు ఓట్ల లెక్కింపు జరిగింది. మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి ఫ్యానల్ విజయ ం సాధించగా అందులో నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరికి స్థానం దక్కింది.