సియాల్దా కోర్టు తీర్పు విచారకరం: సీఎం మమతా బెనర్జీ
కోల్‌కతా, జనవరి 21: ఆర్జీ కర్ ఆసుపత్రి వైద్యురాలిపై లైంగికదాడి కేసులో దోషి సంజయ్‌రాయ్‌కి మరణశిక్ష విధించాలని బెంగాల్ ప్రభుత్వం మంగళవారం కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించింది. సోమవారం సియల్దా కోర్టు దోషికి జీవిత ఖైదు (చనిపోయేంతవరకు) విధించిన నేపథ్యంలో మమత సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నది. సియాల్దా కోర్టు తీర్పుపై ముఖ్యమంత్రి మమ తా బెనర్జీ ‘ఎక్స్’ ద్వారా స్పందించా రు. సియాల్దా కోర్టు తీర్పు దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు.
తొందరపాటు చర్య: మృతురాలి తండ్రిత్వరలో మాకు సియాల్దా కోర్టు తీర్పు కాపీ అందిన తర్వాత ఏం చేయాలో తమ కుటుంబం నిర్ణయానికి వస్తుందని మృతురాలి తండ్రి చెప్పారు. సీఎం తొందరపాటు చర్యలు తీసుకోకూడదన్నా రు. సీబీఐ కోర్టులో సరైన సాక్ష్యాధారాలు సమర్పించలేకపోవడంతోనే దోషికి స్థానిక కోర్టులో జీవిత ఖైదు పడిందని భావిస్తున్నామన్నారు. సాక్ష్యాధారాలు తారుమారవుతున్న తరుణంలో సీఎం ఏం చేశారు ?’ అని సూటిగా ప్రశ్నించారు.