న్యూఢిల్లీ,(విజయక్రాంతి): రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన గవర్నర్ గా సంజయ్ మల్హోత్రా నియమితులయ్యారు. మల్హోత్రా నియామిస్తూ కేంద్ర క్యాబినెట్ కమిటీ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం గవర్నర్ శక్తికాంతదాస్ పదవీకాలం డిసెంబర్ 10తో ముగియనుంది. 2018లో ఆర్బీఐ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన శక్తికాంత దాస్ పదవీ కాలం 2021లోనే ముగియగా కేంద్రం మరో మూడేళ్లు పొడింగించింది. ఈ గడువు ఎల్లుండి ముగియడంతో కొత్త గవర్నన్ గా సంజయ్ మల్హోత్రా బుధవారంనాడు పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈయన మూడేళ్లపాటు పదవిలో కొనసాగనున్నారు. 1990 బ్యాచ్, రాజస్థాన్ కేడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి మల్హోత్రా ప్రస్తుతం కేంద్ర రెవెన్యూశాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.