బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తన కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ‘లవ్ అండ్ వార్’ అంటూ టైటిల్ కార్డును రిలీజ్ చేసి మూవీ కాస్ట్‌ను వెల్లడించారాయన. ఈ సినిమాలో అలియా భట్, రణబీర్ కపూర్, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రల్లో నటించబోతున్నారు. తద్వారా అలియా భట్ మరోమారు రణబీర్ కపూర్‌తో కలిసి తన సూపర్ హిట్ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న చిత్రంలో నటించనుంది. ఒక గొప్ప ప్రేమకథను ఈ సినిమాలో చూపించబోతున్నారట భన్సాలీ.
అలియా, రణబీర్, విక్కీతో ఒక గొప్ప ప్రేమగాథ అంటూ సినిమా అనౌన్స్ చేయడంతో.. భన్సాలీ మరో ‘ఆషీకీ’ తీయబోతున్నారా..? అనే సందేహం కలుగుతోంది. ఈ తాజా ప్రాజెక్టు ‘లవ్ అండ్ వార్’ను 2025 క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయనున్నట్టు కూడా ఇప్పుడే ప్రకటించేశారు దర్శకుడు సంజయ్. ఆయన దర్శకత్వంలో చివరిగా వచ్చిన ‘గంగూబాయి కతియావాడి’లో అలియా భట్ మెయిన్ లీడ్ రోల్ పోషించింది. ఆ పాత్రలో తనదైన నటనతో మెప్పించిన అలియాకు జాతీయ పురస్కారం కూడా దక్కింది. ఈ హిట్ పేర్ త్రయం ‘లవ్ అండ్ వార్’ కోసం చేతులు కలుపుతుండడంతో అభిమానులతోపాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలేర్పడ్డాయి.