ప్రమాదవశాత్తు లారీ కింద చిక్కుకున్న మహిళ
సహాయక చర్యలు చేపట్టిన మంత్రి
చికిత్సకు అయ్యే ఖర్చు భరిస్తానని హామీ
కరీంనగర్, నవంబర్ 11 (విజయక్రాంతి): ప్రమాదవశాత్తు లారీ కింద ఇరుక్కున్న మహిళ ప్రాణాలను కేంద్ర హోంశాఖ సహా య మంత్రి బండి సంజయ్ కాపాడారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం కెల్లడ గ్రామానికి చెందిన దివ్యశ్రీ సోమవారం తన భర్తతో కలిసి స్కూటీపై వెళ్తుం డ గా కళ్లు తిరిగి కిందపడింది.కిందపడింది. అదే సమయం లో అటుగా వెళ్తున్న లారీ రాడ్డుకు దివ్యశ్రీ జుట్టు చుట్టుకున్నది.
ఇది గమనించని లారీ డ్రైవర్ అలాగే వెళ్తుండగా మహిళ అరుపులు విని హుజూరాబాద్ సమీపంలోని సింగాపూర్ శివారులో లారీని నిలిపాడు. అదే సమయంలో అదే మార్గం గుండా ములుగు వెళ్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ గమనించి లారీ వద్దకు వెళ్లారు. అటువైపుగా వెళ్తున్న వాహనాలను ఆపి, జాకీల సహాయంతో లారీని కొంతమేర ఎత్తి కత్తెర సహాయంతో దివ్యశ్రీ జుట్టును కత్తిరించారు. అనంతరం కరీంనగర్లోని ప్రైవేటు ఆసుపత్రికి పంపించారు. దివ్యశ్రీ చికిత్సకు అయ్యే ఖర్చును తానే భరిస్తానని ఆసుపత్రి సిబ్బందికి మంత్రి చెప్పారు.