calender_icon.png 19 April, 2025 | 5:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రికెటర్లు అశ్లీల ఫోటోలు పంపించేవారు

18-04-2025 11:43:19 PM

సంజయ్ బంగర్ కూతురు అనయ సంచలన వ్యాఖ్యలు

ముంబై: మాజీ భారత క్రికెటర్ సంజయ్ బంగర్  కుమారుడు ఆర్మన్ హార్మోనల్ రీప్లేస్‌మెంట్ థెరపీ, జెండర్ రీఫార్మింగ్ సర్జరీ ద్వారా అమ్మాయిగా మారిన సంగతి తెలిసిందే. జెండర్ మారిన తర్వాత ఆర్యన్ పేరు కాస్త అనయగా మారింది. ప్రస్తుతం ఆమె లండన్‌లో ఉంటుంది. సర్జరీ తర్వాత క్రికెట్ ఆటలో కొనసాగడానికి చాలా ఇబ్బందులు వచ్చాయని, అందుకే ఆట వదిలేశానని ఆమె ఒక సందర్భంలో చెప్పుకొచ్చింది. తాజాగా లల్లన్‌టాప్‌కు ఇచ్చిన ఇంటర్యూలో కొంతమంది క్రికెటర్లపై సంచలన ఆరోపణలు చేసింది.

ఆ ఇంటర్యూలో అనయ మాట్లాడుతూ.. ‘నేను చాలా మంది ప్రముఖ క్రికెటర్లతో ఆట ఆడాను. ముషీర్ ఖాన్, సర్ఫరాజ్ ఖాన్, యశస్వి జైస్వాల్ వంటి వాళ్లతో ఆడాను. క్రికెట్ ప్రపంచం మొత్తం అభద్రతా భావం, టాక్సిక్ మగాళ్లతో నిండి ఉంది. నేను సర్జరీ చేయించుకున్న తర్వాత కొంతమంది క్రికెటర్లు నన్ను సపోర్టు చేశారు. మరికొంతమంది ఎగతాళి చేశారు. కొంతమంది ప్రముఖ క్రికెటర్లు నాకు అసభ్య ఫోటోలు కూడా పంపారు. సర్జరీకి ముందు ఒక వ్యక్తి ఎప్పుడు నన్ను బూతులు తిట్టేవాడు. నేను భారత్‌లో ఉన్నప్పుడు ఓ మాజీ క్రికెటర్‌కు నా పరిస్థితి గురించి చెప్పాను. అతడు కూడా నాతో తప్పుగా మాట్లాడాడు’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.