25-04-2025 10:09:18 PM
డా ఎస్. మల్లారెడ్డి...
కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): దుండిగల్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకు తక్షణమే జీతాలు ఇవ్వాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు డా ఎస్. మల్లారెడ్డి డిమాండ్ చేశారు. గత మూడు నెలలుగా దుండిగల్ మున్సిపల్ కమిషనర్ పారిశుద్ధ కార్మికులకు జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు డా ఎస్. మల్లారెడ్డి శుక్రవారం నిరాహార దీక్ష చేపట్టి సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ... దుండిగల్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకు కమిషనర్ జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న తీరును బీజేపీ తీవ్రంగా ఖండించింది. సామాన్య కిందిస్థాయి చిరు ఉద్యోగులు కుటుంబం గడవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంటారని, కావున కమిషనర్ కు ఈ నిర్లక్ష్యం తగదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధ్యక్షులు పీసరి కృష్ణారెడ్డి, జిల్లా కిసాన్ మోర్చా నాయకులు గోనె మల్లారెడ్డి, నల్ల రామచంద్రారెడ్డి, సీతారాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.