calender_icon.png 20 January, 2025 | 7:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ కార్మికులకు అండగా ఉంటుంది

20-01-2025 04:18:11 PM

రామయంపేట,(విజయక్రాంతి): రామాయంపేట మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికుల  సమస్యలపై చేపట్టిన నిరసనలో స్థానిక బీజేపీ నాయకులు సోమవారం పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ... రామాయంపేట మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత కేవలం ఒకసారి మాత్రమే పారిశుధ్య పనులకు ఉపయోగించే వస్తువులు ఇచ్చారని తెలిపారు. కార్మికుల న్యాయమైన డిమాండ్ లు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రతి 3 నెలలకు ఒకసారి పనుల కోసం వినియోగించే గ్లౌస్ లు, మాస్క్ లు, శానిటరీ, డ్రెస్ లు, బూట్లు అందించాలన్నారు.

 పెండింగులో ఉన్న ఏడు నెలల పీఎఫ్ రూ.4 వేలు వెంటనే అందించాలని, ప్రతి నెల సరైన సమయానికి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. 2 రోజులు సెలవు రోజులుగా ఇవ్వాలని ప్రతి 3 నెలల కో సారి హెల్త్ చెకప్ క్యాంప్ కార్మికుల కోసం ఏర్పాటు చేయాలన్నారు. పారిశుధ్య కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారంపై భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు జె. శంకర్ గౌడ్, దమ్మయ్య భాను చందర్, ఆర్. వినయ్ కుమార్ నాయకులు ఉన్నారు.