calender_icon.png 22 September, 2024 | 9:03 PM

పారిశుద్ధ్య కార్మికురాలిపై వీధికుక్కల దాడి

28-07-2024 03:55:20 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 27 (విజయక్రాంతి): ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ అధికారులు ఎన్ని చర్యలు చేపడుతున్నా వీధి కుక్కల బెడద నివారించలేక పోతున్నారు. గత వారం వీధి కుక్కల దాడిలో జవహర్‌గనగర్‌లో 18 నెలల బాలుడు మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా నగరంలో వీధి కుక్కలు మరోసారి రెచ్చిపోయాయి. శనివారం మల్కాజిగిరిలోని గిరికృపా కాంప్లెక్స్ వద్ద విధులు నిర్వహిస్తోన్న పారిశుద్ధ్య కార్మికురాలిపై వీధి కుక్కలు దాడిచేశాయి. స్థానికులు సకాలంలో స్పందించి కుక్కను తరిమికొట్టారు. కార్మికురాలికి తీవ్ర గాయా లు కావడంతో ఆసుపత్రికి తరలించారు. కాగా, వీధి కుక్కల దాడిలో గాయపడిన జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలు కమలకు వైద్య ఖర్చుల నిమిత్తం జీహెచ్‌ఎంసీ అధికారులు రూ. 5 వేలు అందజేశారు.