calender_icon.png 26 February, 2025 | 11:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గౌడ్‌గాం జనవాడలో పారిశుద్ధ్య పనులు ప్రారంభం

26-02-2025 12:00:00 AM

నాగల్ గిద్ద , ఫిబ్రవరి 25 : గౌడ్ గాం జనవాడ లో పడకేసిన పారిశుధ్యం పనులు శీర్షిక ఈనెల 20వ తేదీన విజయ క్రాంతి దినపత్రికలు ప్రచురితం కావడం జరిగింది. జిల్లా అధికారుల స్పందించి గ్రామంలో మురికి కాలువలు శుభ్రం చేసేందుకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పరిశుద్ధ కార్మికులు గ్రామంలో ఉన్న రోడ్లు మురికి కాలువలు శుభ్రం చేస్తున్నారు. మురికి కాలువల్లో ఉన్న చెత్తాచెదారాన్ని తొలగిస్తున్నారు. మంగళవారం పంచాయతీ కార్యదర్శి గ్రామాల్లో తిరుగుతూ మురికి కాలువలు శుభ్రం ఎందుకు చర్యలు తీసుకున్నారు. ఎంపిడిఓ మహేశ్వరరావు గ్రామ ప్రత్యేకాధికారి ప్రవీణ్ చారి లు  పారిశుధ్య పనులు వెంటనే చేయాలని ఆదేశించారు. గ్రామంలో పనులు పారిశుధ్య పనులు చేపట్టడంతో  విజయకాంతి పత్రికకు గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.