01-03-2025 07:57:58 PM
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్..
కామారెడ్డి (విజయక్రాంతి): పారిశుధ్య కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శనివారం ఉదయం పట్టణంలోని హైదరాబాద్ రోడ్, నిజాంసాగర్ రోడ్ ప్రాంతాలలో మున్సిపల్ కార్మికులు నిర్వహిస్తున్న పారిశుధ్య కార్యక్రమాలను కలెక్టర్ పరిశీలించారు. పట్టణంలో నిరంతర పారిశుధ్య పనులు నిర్వహించాలని, మురికి కాల్వలలో ఉన్న చెత్తను తొలగించాలని తెలిపారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న మొక్కలు, చెట్లకు ప్రతీ రోజూ నీటిని పోయాలని తెలిపారు. అక్కడే ఉన్న పబ్లిక్ టాయిలెట్ ను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా హౌసింగ్ బోర్డు వాకర్స్ కలెక్టర్ ను కలిసి హౌసింగ్ బోర్డు కాలనీ ని సందర్శించాలని, మొక్కలకు అవసరమైన నీటి సరఫరాకు బోర్ ను మరమ్మతు చేయించాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ కమీషనర్ రాజేందర్ రెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ పర్వేజ్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.