calender_icon.png 20 March, 2025 | 8:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారిశుద్ధ్యం జాడేది..

17-03-2025 12:00:00 AM

కల్లూరు, మార్చి 16 (విజయ క్రాంతి): కల్లూరు మండల పరిషత్ కా ర్యాలయం  ఆవరణలో పారిశుధ్యం లోపించించి, చెత్తా చెదారం దర్శనమిస్తోంది. ఇక్కడ పలు ప్రభుత్వం కార్యాలయాలు సమికృతం గా ఉన్నాయి. తహసీల్దార్ కార్యాలయం, మండల పశువుల వైద్య శాల, మండల విద్యా శాఖ కార్యాలయం, ఉపాధి హామీ కార్యాలయం, స్త్రీ శక్తి భవనం, వ్యవసాయం రైతు వేదిక కార్యాలయాలు ఇందులో ఉన్నాయి నిత్యం  అవసరాల కోసం మండలం లోని అన్ని గ్రామాల నుండి ఏదో ఒక పని మీద ప్రభుత్వం కార్యాలయాలకి వస్తూ ఉంటారు.అసలే ఎండలు మండిపోతున్నాయి.

ప్రభుత్వం కార్యాలయంలో వివిధ పనుల నిమిత్తం వచ్చిన ప్రజలు నీడ కోసం చెట్ల కింద నిలబడదాం అంటే ఎక్కడ చుసినా చెత్త చెదారంతో అపరి శుభ్రం గా ఉన్న పరిస్థిలు చూసి ప్రజలు అవాక్కు అవుతున్నారు. నిత్యం ప్రజా రద్దీ తో ఉండే  ప్రభుత్వం కార్యాలయాలే  ఇంత అపరిశుభ్రం గా ఉంటే ఇక పల్లెల్లో  పారిశుద్ధ్య పరిస్థితి ఏ విధంగా  ఉంటుందని బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మండల పరిషత్ కార్యాలయంలో పేరుకు పోయిన చేత్త చెదారం తొలిగించి ఆవరణలో శుభ్రంగా ఉంచాలని ప్రజలు కోరుకుంటున్నారు.