calender_icon.png 21 February, 2025 | 11:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గౌడగం జన్వాడలో పడకేసిన పారిశుధ్యం?

21-02-2025 12:13:01 AM

  1. నర్సరీలో ఎండిపోయిన మొక్కలు
  2. చుట్టపు చూపుగా వచ్చి వెళుతున్న పంచాయతీ కార్యదర్శి 
  3. పట్టించుకోని మండల అధికారులు

నాగల్ గిద్ద, ఫిబ్రవరి 20 : పారిశుద్ధ్యం పనులు నిర్వహించేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్న పంచాయతీ కార్యదర్శులు నిర్లక్ష్యంతో చెత్త, మురికి నీరు రోడ్లపై ప్రవహిస్తుందని ప్రజలు ఆరోపి స్తున్నారు. గ్రామాలను పచ్చని చెట్లతో కళకళ లాడేలా నర్సరీలో మొక్కల పెంపకం చేస్తు న్నారు. పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యంతో నర్సరీలో మొక్కలు ఎండిపోతున్నాయి.

పర్యవేక్షణ చేయవలసిన మండల అధికా రులు పట్టించుకోకపోవడంతో పంచాయతీ కార్యదర్శి ఇష్టారాజ్యంగా వ్యవహరి స్తున్నారు. నాగల్ గిద్ధ మండలంలోని  గౌడ్ గాం జనవాడ గ్రామంలో పారిశుధ్యం పడ కేసింది. చెత్త సేకరించకపోవడం, మురికి కాలువలు శుభ్రం చేయకపోవడంతో గ్రామంలో  దోమలు, ఈగల బెడద పెరిగిం దని ప్రజల ఆరోపిస్తున్నారు. 

రోడ్డుపైన మురికి నీరు నిలవడంతో దోమల బెడద ఎక్కువైందని గ్రామస్తులు తెలిపారు. చెత్త సేకరించే ట్రాక్టరు ఏ ఒక్కరోజు కూడా సేక రించడం లేదని ప్రజలు తెలిపారు. గ్రామం లో ఎక్కడి చెత్త అక్కడే నిండిపోతుంది. మురికి కాలువలు చెత్త ఎండిపోయి  కంపు వాసన వస్తుందని ప్రజల ఆరోపిస్తున్నారు.

ప్రభుత్వం ప్రత్యేకంగా చేపట్టిన క్రీడా ప్రాంగణా బోర్డును ఏర్పాటు చేయకుండా పాఠశాల పక్క చెత్తలో పడేశారని గ్రామ స్తులు ఆరోపించారు. నర్సరీలు మొక్కల పెంపకం కోసం ప్రభుత్వం లక్షల నిధులు ఖర్చు చేస్తున్న పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యంతో మొక్కలు ఎండిపోతున్నాయి. 

గ్రామంలో ఇంతవరకు ఒక్క గ్రామసభ నిర్వహించలేదని గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి పనులు గురించి చర్చించిన సంఘటనలు లేవని  ప్రజలు ఆరోపించారు. సభ నిర్వహించకుండానే సంతకాలు పెట్టుకొని పంచాయతీ కార్యదర్శి వెళ్లిపోతున్నాడని గ్రామస్తులు తెలిపారు.

గ్రామంలో ఉన్న వాడల్లో కనీసం వీధిలైట్లు, ఐమాక్స్ ప్లేట్లు వేయలేదని రాత్రి సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు తెలిపారు.

గ్రామంలో పర్యటించి సమస్యలు తెలుసుకుంటాం..

గ్రామాన్ని పరిశీలించి సమస్యలు తెలుసుకుని పంచాయతీ కార్యదర్శి పై చర్యలు తీసుకుంటామన్నారు. పారిశుద్ధ్యం పనులు చేసేందుకు ఆదేశాలు ఇస్తామని, నర్సరీలో మొక్కలు ఎండిపోయిన విషయంపై జిల్లా అధికారులకు నివేదిక ఇస్తామన్నారు.

 మహేశ్వరరావు, ఎంపీడీవో

  నాగల్‌గిద్ద