26-01-2025 04:48:35 PM
హుజురాబాద్ (విజయక్రాంతి): గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్తమ ఉద్యోగులకు కరీంనగర్ పరేడ్ గ్రౌండ్ లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి చేతుల మీదుగా అవార్డుల అందజేశారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మున్సిపల్ కార్యాలయంలో సానిటరీ జవాన్ గా పనిచేస్తున్న ప్రతాప రాజు, సిస్టం మేనేజర్ సాయికుమార్, మెప్మా విభాగంలో పని చేస్తున్న పసుల స్వప్నలకు ఉత్తమ ప్రతిభ ప్రశంసా పత్రాలను జిల్లా కలెక్టర్ పమేల సత్పత్తి చేతుల మీదుగా అందుకున్నారు. ఉత్తమ ఉద్యోగ పురస్కారం అందుకున్న ప్రతాపరాజుకు పలువురు ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, స్నేహితులు అభినందనలు తెలిపారు.