- కొట్టిపడేసిన ఇమ్రాన్ మీర్జా
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా.. టీమిండియా పేసర్ మహమ్మద్ షమీని పెళ్లి చేసుకోనుందనే వార్తలను సానియా తండ్రి ఇమ్రాన్ మీర్జా ఖండించారు. పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో ఇటీవలే వివాహబంధానికి ముగింపు పలికిన సానియా.. ప్రస్తుతం కుమారుడు ఇజ్‌హాన్‌తో కలిసి నివసిస్తోంది. మరోవైపు 2014లో హసీన్ జహాన్‌ను వివాహం చేసుకున్న షమీ.. ఆ తర్వాత మనస్పర్థల కారణంగా ఆమెతో విడిపోయాడు. కాగా.. ఈ ఇద్దరు పెళ్లి చేసుకోనున్నారని గత కొంతకాలంగా సోషల్ మీడియాలో పుకార్లు చక్కర్లు కొడుతున్నా యి. ఈ నేపథ్యంలో సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్ మీర్జా స్పందిస్తూ.. ‘ఇవ్వనీ చెత్త వార్తలు.. తప్పుడు కథనాలు. సానియా కనీసం షమీని కలవనేలేదు’ అని పేర్కొన్నారు.