calender_icon.png 26 March, 2025 | 10:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రాద్రి రామయ్య సన్నిధిలో సంగారెడ్డి ఎస్పి పరితోష్ పంకజ్

23-03-2025 12:19:53 PM

భద్రాచలం,(విజయక్రాంతి): భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి(Bhadradri Sri Sita Ramachandra Swamy) వారిని ఆదివారం  సంగారెడ్డి పోలీస్ ఎస్పి పరితోష్ పంకజ్(Sangareddy Police SP Paritosh Pankaj) దంపతులు దర్శించుకున్నారు.ఆలయంలో  సీతారామచంద్ర స్వామి వారి మూల వరలకు ప్రత్యేక పూజలు చేశారు. గతంలో భద్రాచలం ఏఎస్పీగా పని చేసి, ప్రమోషన్ పై కొత్తగూడెం ఓ ఎస్ డి గా బదిలీపై వెళ్లి అక్కడి నుండి సంగారెడ్డి ఎస్పీగా ప్రమోషన్ పొందిన అనంతరం తొలిసారి తిరిగి భద్రాచలం వచ్చారు. ఈ సందర్భంగా దేవాలయం వద్ద అధికారులు సంప్రదాయంగా స్వాగతం పలికి, దైవ దర్శనం అనంతరం లక్ష్మీ తాయారు అమ్మవారి దేవాలయంలో వేద పండితులు వేద ఆశీర్వాదం నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. సంగారెడ్డి ఎస్పీ వెంట భద్రాచలం సిఐ బర్పటి శ్రీనివాస్, ట్రాఫిక్ ఎస్ఐ మధు ప్రసాద్ , దేవాలయం ఇంచార్జ్ సాయిబాబా తదితరులున్నారు