calender_icon.png 24 February, 2025 | 5:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వారణాసి వద్ద రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

24-02-2025 03:14:00 PM

ఉత్తర్ ప్రదేశ్,(విజయక్రాంతి): వారణాసిలో ఒక విషాదకరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. కుంభమేళా నుండి తిరిగి వస్తున్న ముగ్గురు యాత్రికులు మరణించారు. వివరాల్లోకి వెళ్లితే... కుంభమేళాకు వెళ్లి వస్తుండగా వారణాసి వద్ద కారు టిప్పర్ ను వెనుకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రమాదంలో తెలంగాణలోని సంగారెడ్డికి చెందిన జహీరాబాద్ నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకట రామి రెడ్డి(46), ఆయన భార్య విలాసి(40), వారి డ్రైవర్ న్యాల్ కల్ మండలం మల్గికి చెందిన మల్లా రెడ్డి మరణించారు. వాహనంలో ఉన్న మరో ముగ్గురు ప్రయాణికులు గాయపడి వైద్య చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.