సంగారెడ్డి అర్బన్,(విజయక్రాంతి): అభివృద్ధి సంక్షేమ పథకాలను అర్హులైన వారికి అందించేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని జహీరాబాద్ ఎంపీ జిల్లా అభివృద్ధి కమిటీ చైర్మన్ సురేష్ కుమార్ సెట్కార్ తెలిపారు. గురువారం సంగారెడ్డి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వేగవంతంగా అమలు చేయాలని కోరారు.
జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు మొదట ప్రాధాన్యత ఇవ్వాలని నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై ప్రభుత్వం కఠినంగా వివరిస్తుందన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్ సంజీవరెడ్డి తోపాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.